ఆ వీడియోను ఆయనే విడుదల చేశారు.. మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి సెక్స్ సీడీ కేసులో బాధిత యువతి
- 11 రోజుల తర్వాత అజ్ఞాతం నుంచే వీడియో విడుదల
- వీడియోను ఎవరు చిత్రీకరించారో తనకు తెలియదని వివరణ
- రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరిన బాధిత యువతి
కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించారని, తనతో సన్నిహితంగా ఉన్న వీడియో సీడీని ఆయనే విడుదల చేశారని అజ్ఞాతంలో ఉన్న బాధిత యువతి పేర్కొంది. సంచలనం సృష్టించిన ఆ వీడియో విడుదలైన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఆమె 11 రోజుల అనంతరం గత రాత్రి సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. వీడియోను ఎవరు, ఎప్పుడు, ఎలా చిత్రీకరించారన్న విషయం తనకు తెలియదన్న ఆమె అది బయటకు రావడంతో తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ బాధతో మూడునాలుగుసార్లు ఆత్మహత్యకు కూడా యత్నించినట్టు తెలిపింది. తన వెనక ఎవరూ లేరని, తన తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేసింది.
రమేశ్ జార్కిహోళి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించాడని ఆరోపించిన బాధిత యువతి.. తనకు రక్షణ కల్పించాల్సిందిగా రాష్ట్ర హోం మంత్రి బసవరాజు బొమ్మైని కోరింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా, బాధిత యువతి అజ్ఞాతం నుంచే వీడియో విడుదల చేయడంతో ఆమె ఆచూకీ కనుగొనడం పోలీసులకు కష్టంగా మారింది. మరోవైపు, ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసేందుకు కొందరు నకిలీ సీడీ సృష్టించి మానసికంగా హింసించారని, దీని వెనక ఉన్న ప్రతి ఒక్కరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.