జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ కు డబ్ల్యూహెచ్ఓ గ్రీన్ సిగ్నల్

  • ప్రస్తుతం అన్నీ రెండు డోసుల వ్యాక్సిన్లే
  • తొలిసారి సింగిల్ డోస్ వ్యాక్సిన్ తెచ్చిన జాన్సన్ అండ్ జాన్సన్
  • ఇప్పటికే అనుమతి నిచ్చిన యూరప్ మెడిసిన్స్ ఏజెన్సీ
  • ఒక్కరోజు వ్యవధిలో డబ్ల్యూహెచ్ఓ అనుమతి  
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కరోనా నివారణకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకువచ్చిన ఘనత అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మా సంస్థ సొంతం చేసుకుంది. తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. క్లినికల్ ట్రయల్స్ డేటా పరిశీలించిన మీదట ఈ అనుమతి నిచ్చినట్టు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

అంతర్జాతీయంగా తాము అమలు చేస్తున్న కొవాక్స్ కార్యక్రమంలో ఈ వ్యాక్సిన్ ను వినియోగించవచ్చని, ఇతర దేశాలు ఈ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. పెద్దవారిపై ఈ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్టు వెల్లడైందని తెలిపింది.

జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించిన ఈ సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ కు యూరప్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) నిన్ననే అత్యవసర అనుమతి నిచ్చింది. ఆ మరుసటి రోజే డబ్ల్యూహెచ్ఓ కూడా అత్యవసర అనుమతులు ఇవ్వడం విశేషం అని చెప్పాలి.


More Telugu News