తొలి టీ20లో ఓటమి నేపథ్యంలో రెండో మ్యాచ్ కు తుదిజట్టులో రోహిత్ శర్మ!
- ఇంగ్లండ్ తో తొలి టీ20లో భారత్ ఓటమి
- రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన మేనేజ్ మెంట్
- రెండో మ్యాచ్ లో రోహిత్ ను ఆడించాలని నిర్ణయం!
- బౌలింగ్ విభాగంలోనూ మార్పులు
- చహర్ బ్రదర్స్ కు అవకాశం!
అహ్మదాబాద్ లో నిన్న ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఫామ్ లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మను ఆ మ్యాచ్ లో ఆడించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు జరిగే రెండో టీ20 మ్యాచ్ లో రోహిత్ శర్మను బరిలో దించాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది.
ఈ క్రమంలో రోహిత్ తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించడం ఖాయంగా కనిపిస్తోంది. అటు, ముగ్గురు స్పిన్నర్ల ఎత్తుగడ బెడిసికొట్టడంతో బౌలింగ్ కూర్పుపైనా కసరత్తులు చేయనున్నారు. యజువేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్ స్థానంలో చహర్ బ్రదర్స్ (దీపక్, రాహుల్)లకు తుదిజట్టులో స్థానం దక్కే అవకాశాలున్నాయి.