కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోతున్న నావ: జీవీఎల్

  • ఇండియా టుడే కాంక్లేవ్ లో జీవీఎల్ వ్యాఖ్యలు
  • కాంగ్రెస్ ను వీడేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి
  • కాంగ్రెస్ చుక్కాని లేని నావలా తయారైందని వ్యాఖ్యలు
  • కాంగ్రెస్ కు దశదిశ లేవన్న జీవీఎల్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు కాంగ్రెస్ పార్టీపై వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే కాంక్లేవ్ లో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఓ మునిగిపోతున్న నావ లాంటిదని, ఆ పార్టీని సంఘటితంగా ఉంచడం బీజేపీ పని కాదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి తాము ఎవరినీ ఏరుకోవడంలేదని, తనకు తెలిసినంతవరకు కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పార్టీని వీడేందుకు అవకాశం కోసం చూస్తున్నారని వెల్లడించారు. ఎందుకంటే, కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదన్న సంగతి వారికి తెలుసని, ఆ పార్టీ నాయకత్వానికి దశదిశ లేదని, చుక్కాని లేని నావ అని జీవీఎల్ విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయకుండా ఉండేందుకు బీజేపీ కావాలనే కాంగ్రెస్ లో ఫిరాయింపులను, తిరుగుబాట్లను ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలపై జవాబిస్తూ జీవీఎల్ ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News