ఆ వార్తల్లో నిజం లేదు: రానా

  • 'దృశ్యం 2' సినిమాలో రానా నటిస్తున్నాడని వార్తలు
  • అవన్నీ పుకార్లు మాత్రమేనన్న రానా
  • ఆ చిత్రంలో నటించడం లేదని వ్యాఖ్య
మలయాళం లో హిట్ అయిన 'దృశ్యం 2' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో రానా కూడా నటిస్తున్నాడనే వార్తలు షికారు చేస్తున్నాయి.

తాజాగా ఓ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ, ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని... ఆ చిత్రంలో తాను నటించడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు రానా ప్రస్తుతం 'అరణ్య' చిత్రం విడుదల పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో రానా ఆదివాసి పాత్రను పోషించాడు. మరోపక్క, పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో మలయాళ హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియమ్'  తెలుగు రీమేక్ కూడా రూపొందుతోంది. 


More Telugu News