విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు వాళ్లు కొనకపోతే ప్రభుత్వమే కొనే ప్రయత్నం చేస్తుంది: చీఫ్ విప్ సామినేని
- విశాఖ ఉక్కు పరిశ్రమ అంశంపై సామినేని స్పందన
- ప్లాంట్ ను మూతపడనివ్వబోమని స్పష్టీకరణ
- కడప ప్లాంట్ కంటే విశాఖ ప్లాంట్ కే జగన్ ప్రాధాన్యమిస్తున్నారు
- ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళతామన్న సామినేని
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ఏపీ ప్రభుత్వ వైఖరిని చీఫ్ విప్ సామినేని ఉదయభాను వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ మూతపడనివ్వబోమని స్పష్టం చేశారు. ప్రైవేటు వాళ్లు కొనకపోతే ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వమే కొనే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కే సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించుకోవాలని సామినేని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో అఖిలపక్ష నేతలను ప్రధాని వద్దకు తీసుకెళతామని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విపక్షాలు వైసీపీతో కలిసిరావాలని కోరారు.