10 దేశాల నుంచి రాకపోకలపై నిషేధాన్ని పొడిగించిన ఒమన్

  • 10 దేశాలపై ఇప్పటికే నిషేధం విధించిన ఒమన్
  • కరోనా కేసులు పెరుగుతుండటంతో నిషేధం కొనసాగింపు
  • తమ పౌరులకు, విదేశీ దౌత్యవేత్తలకు మినహాయింపు  
పలు దేశాల్లో కరోనా తీవ్రత అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడం కోసం గల్ఫ్ దేశం ఒమన్ పలు దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న 10 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశాలపై నిషేధాన్ని ఒమన్ పొడిగించింది. తదుపరి నోటీసులు వచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని ఒమన్ సుప్రీం కమిటీ తెలిపింది.

అయితే తమ దేశ పౌరులు, సుల్తానేట్ లోని విదేశీ దౌత్యవేత్తలు, దేశంలో పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులకు మాత్రం నిషేధం నుంచి మినహాయింపును ఇచ్చింది. ఒమన్ నిషేధించిన దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా, బ్రెజిల్, ఇథియోపియా, నైజీరియా, టాంజానియా, సూడాన్, లెబనాన్, సియెర్రాలియోన్, ఘనా, గినియా ఉన్నాయి.


More Telugu News