విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించొద్దంటూ ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది
- ఇంతవరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు
- ఇప్పుడు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ
- జగన్ ఎందుకు పోరాడడం లేదంటున్న శైలజానాథ్
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించకూడదని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద కాంగ్రెస్ ఏపీ నేతలు ధర్నాకు దిగారు. అలాగే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
ఏపీకి ఇంతవరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ఇప్పుడు విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరించడానికి నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలను రాబట్టే బాధ్యత సీఎంకు ఉంటుందని, వైసీపీ పార్లమెంట్‌లో ఈ విషయాలపై పోరాడాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై అన్ని పక్షాలను కలుపుకుని ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారని ఆయన అడిగారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో బిల్లులకు వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
కాగా, దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయడమే లక్ష్యంగా ఎన్డీఏ సర్కారు పనిచేస్తోందని ఇతర కాంగ్రెస్ నేతలు మండపడ్డారు. మరోపక్క, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఈ నెల 25న సమ్మెకు దిగాలని ఇచ్చిన పిలుపునకు కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది.