సుదీర్ఘకాలం ఆందోళన కొనసాగించేందుకు ఢిల్లీ సరిహద్దుల్లో ఇళ్లు కట్టుకుంటున్న రైతులు
- కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలపై ఆందోళన
- ఉపసంహరించుకునే వరకు వెనుదిరిగేది లేదంటోన్న రైతులు
- 25 ఇళ్ల నిర్మాణాలు పూర్తి
- మొత్తం 1000 నుంచి 2,000 మధ్య ఇళ్ల నిర్మాణాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకునే వరకు తాము వెనుదిరిగేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న వారి ఆందోళనలు సుదీర్ఘకాలం జరిగే అవకాశం ఉండడంతో సరిహద్దుల్లో వారు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
టిక్రీ సరిహద్దు వద్ద ఇటుకలతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటివరకు 25 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, తాము మొత్తం 1000 నుంచి 2,000 మధ్య ఇళ్లను నిర్మించుకుంటామని రైతు సంఘాల నేతలు చెప్పారు. సరిహద్దుల్లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇళ్లను నిర్మించుకుంటున్నారు.
ఈ ఇళ్ల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా, వాటిని పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్చి 26న భారత్ బంద్ చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.