పులివెందులకు మరో ప్రభుత్వ కార్యాలయం తరలింపు.. ఉత్తర్వులు జారీ 

  • వెటర్నరీ ఇనిస్టిట్యూట్‌ను పులివెందులకు తరలిస్తూ ఉత్తర్వులు
  • 30 వేల చదరపు గజాల్లో నిర్మాణాలు
  • ఉద్యోగులకు అక్కడే క్వార్టర్స్
విజయవాడ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్కటిగా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఏపీ సర్కారు పేర్కొంటున్న వికేంద్రీకరణలో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం జరిగింది. విజయవాడలోని వెటర్నరీ బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (వీబీఆర్ఐ)ని కడప జిల్లాలోని పులివెందులకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం పులివెందులలో 30 వేల చదరపు గజాల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే, ఉద్యోగులకు పులివెందులలో క్వార్టర్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది.

విజయవాడలో ఏర్పాటుచేయ తలపెట్టిన కమాండ్ కంట్రోల్ రూము నిర్ణయాన్ని మార్చుకున్న ప్రభుత్వం దానిని విశాఖకు తరలించాలని ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వీబీఆర్‌ని తరలిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నిజానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం విజయవాడలో స్థలాన్ని ఎంపిక చేసి రూ. 13.80 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది. అయితే, జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం మారింది. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం అందులో భాగంగానే పలు ప్రభుత్వ కార్యాలయాలను అక్కడికి తరలిస్తోంది.


More Telugu News