తిరుపతిలో ఆసుపత్రి నిర్మాణం కోసం రూ.300 కోట్ల విరాళం ప్రకటించిన ముంబయి వ్యాపారవేత్త

  • తిరుపతిలో 300 పడకల చిన్నపిల్లల ఆసుపత్రి
  • ఆసుపత్రి నిర్మించి టీటీడీకి అప్పగించనున్న ముంబయి సంస్థ
  • వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో ఒప్పందం
  • స్వచ్ఛందంగా ఆసుపత్రి నిర్మాణం
ముంబయికి చెందిన సంజయ్ కె సింగ్ తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. ఆయన రూ.300 కోట్లతో తిరుపతిలో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేందుకు టీటీడీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిగా సంజయ్ కె సింగ్ చేపట్టి టీటీడీకి అప్పగించనున్నారు.

రూ.300 కోట్ల వ్యయంతో 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తిరుపతిలో నిర్మించేందుకు సంజయ్ కె సింగ్ కు చెందిన ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ (యూఐసీ) సంస్థ టీటీడీతో ఎంవోయూ కుదుర్చుకుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో యూఏసీ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కె సింగ్, టీటీడీ అధికారులు ఒప్పంద పత్రాలు పరస్పరం మార్చుకున్నారు.


More Telugu News