ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మమతా బెనర్జీ
- మమత చికిత్సకు సహకరించారన్న వైద్యులు
- మరో 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలన్నా డాక్టర్లు
- ఇక తాను వెళతానని చెప్పిన మమత
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రి నుంచి విడుదలయ్యారు. నందిగ్రామ్ పర్యటనలో ఆమె గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె కోల్ కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. రెండు రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత ఆమె డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్ నుంచి వీల్ చైర్ లో ఆమె బయటకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. చికిత్సకు ముఖ్యమంత్రి బాగా సహకరించారని తెలిపారు. మరో 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలని తాము చెప్పామని.. అయితే దానికి ఆమె అంగీకరించలేదని చెప్పారు. తనను డిశ్చార్జ్ చేయాలని కోరారని తెలిపారు. ఆమె విన్నపం మేరకు... వైద్యసలహాలను ఇచ్చి, డిశ్చార్జ్ చేశామని చెప్పారు.
మమత కాలుకు వేసిన ప్లాస్టర్ కట్టును తెరిచి పరీక్షించామని, కొంత బెటర్ గా ఉందని వైద్యులు తెలిపారు. చీలమండ వద్ద అయిన గాయం కూడా కొంత మెరుగయిందని చెప్పారు. వారం రోజుల తర్వాత మళ్లీ ఒకసారి ఆసుపత్రికి రావాలని సూచించామని తెలిపారు. మరోవైపు వీల్ చైర్ నుంచే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తానని మమత ఇంతకు ముందే చెప్పిన సంగతి తెలిసిందే.