చైనా ఈ-కామర్స్ సైట్ ను షేక్ చేస్తున్న 'ట్రంప్ బుద్ధ' విగ్రహం

  • ధ్యానముద్ర లో ఉన్న ట్రంప్ విగ్రహాల అమ్మకం
  • 150 నుంచి 610 డాలర్ల ఖరీదు
  • ఫన్ కోసమే జనాలు కొంటున్నారన్న గ్లోబల్ టైమ్స్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా చైనాలో ఆయనను అభిమానిస్తున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. బుద్ధుడి మాదిరి ధ్యానముద్రలో ఉన్నట్టున్న ట్రంప్ విగ్రహాన్ని ఓ చైనీస్ ఈ-కామర్స్ సంస్థ విక్రయిస్తోంది. పద్మాసనంలో కూర్చొని, చేతులను ఒళ్లో పెట్టుకుని, కళ్లు మూసుకుని ధ్యానం చేస్తున్నట్టున్న ట్రంప్ విగ్రహం అక్కడి జనాలను ఆకట్టుకుంటోంది.

'ట్రంప్..  బుద్ధిజం అందరి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి' అని దానికి టైటిల్ పెట్టారు. జావోబావో అనే కంపెనీ ఈ విగ్రహాలను అమ్ముతోంది. చైనాకు చెందిన ప్రఖ్యాత అలీబాబా సంస్థకు చెందినదే ఈ కంపెనీ. 1.6 మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహాలను 999 చైనీస్ యువాన్లకు (150 యూఎస్ డాలర్లు) విక్రయిస్తున్నారు. పెద్ద సైజును 610 డాలర్లకు అమ్ముతున్నారు.

తన వ్యాపారం కోసం ట్రంప్ ను టావోబావో బాగా వాడుకుంటోంది. ట్రంప్ ఫేస్ మాస్కులు, టోపీలు, సాక్సులు, విగ్రహాలను విక్రయిస్తూ బిజినెస్ పెంచుకుంటోంది. దీని గురించి చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురిస్తూ... ఫన్ కోసమే ప్రజలు వీటిని కొంటున్నారని పేర్కొంది.


More Telugu News