ఇంగ్లండ్ తో టీ20 మ్యాచ్ లకు 50 శాతం మంది ప్రేక్షకులకే అనుమతి
- భారత్, ఇంగ్లండ్ మధ్య 5 టీ20లు
- అన్ని మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తున్న నరేంద్ర మోదీ స్టేడియం
- గుజరాత్ లో కరోనా వ్యాప్తి
- సగం టికెట్లే అమ్మాలని గుజరాత్ క్రికెట్ సంఘం నిర్ణయం
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య నేటి నుంచి 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ షురూ కానుంది. ఈ సిరీస్ లోని అన్ని మ్యాచ్ లకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం (మొతేరా) వేదికగా నిలుస్తోంది. అయితే, గుజరాత్ లో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ భారీ స్టేడియంలో 50 శాతం ప్రేక్షకులనే అనుమతించాలని సిరీస్ కు ఆతిథ్యమిస్తున్న గుజరాత్ క్రికెట్ సంఘం నిర్ణయించింది. మార్చి 12న ప్రారంభమయ్యే ఈ టీ20 సిరీస్ మార్చి 20న ముగియనుంది.
దీనిపై గుజరాత్ క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు ధన్ రాజ్ నత్వాని స్పందిస్తూ... స్టేడియం సామర్థ్యంలో సగం మాత్రమే నిండేలా టికెట్ల అమ్మకం చేపడుతున్నట్టు తెలిపారు. టికెట్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో విక్రయిస్తున్నట్టు వెల్లడించారు.