ఇక కరోనా నివారణకు సింగిల్ డోస్ వ్యాక్సిన్... యూరప్ లో అనుమతి

  • ఇప్పటివరకు కరోనా నివారణకు రెండు డోసుల వ్యాక్సిన్లు
  • సింగిల్ డోస్ టీకా అభివృద్ధి చేసిన జాన్సన్ అండ్ జాన్సన్
  • అనుమతి మంజూరు చేసిన ఈఎంఏ
  • జాన్సన్ అండ్ జాన్సన్ అందించిన డేటా భేషుగ్గా ఉందన్న ఈఎంఏ
కరోనా మహమ్మారి నివారణకు ప్రస్తుతం అందజేస్తున్న వ్యాక్సిన్లన్నీ రెండు డోసుల వ్యాక్సిన్లే. అయితే, అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫార్మా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. తాజాగా ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ వినియోగానికి యూరోపియన్ యూనియన్ డ్రగ్ కంట్రోల్ రెగ్యులేటరీ 'యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ' (ఈఎంఏ) అనుమతులు మంజూరు చేసింది. తద్వారా యూరప్ ఖండంలోని 27 దేశాలకు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

జాన్సన్ అండ్ జాన్సన్ అందించిన వ్యాక్సిన్ డేటాను సమగ్రంగా పరిశీలించిన మీదటే అనుమతి ఇచ్చినట్టు యూరప్ డ్రగ్ కంట్రోల్ రెగ్యులేటరీ స్పష్టం చేసింది. ఈ సింగిల్ వ్యాక్సిన్ సమర్థ పనితీరుతో ప్రజల జీవితాలను సురక్షితంగా ఉంచుతుందని భావిస్తున్నట్టు ఈఎంఏ వర్గాలు వెల్లడించాయి.


More Telugu News