రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను: నారా లోకేశ్

  • రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు
  • రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే శిక్ష
  • పోలీసులు ప్రతి తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదు
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో హైకోర్టు అడ్వకేట్  శివారెడ్డి ఇంటి వద్ద ఉన్న సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా  స్పందిస్తూ ప్రభుత్వం, పోలీసులపై మండిపడ్డారు.

'స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టినందుకే అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై కక్షసాధింపులో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే శిక్ష అనడానికి అనపర్తి సంఘటన చక్కటి ఉదాహరణ. సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నాలు ఎన్ని చేసినా చివరికి న్యాయమే గెలుస్తుంది. కోర్టులో ఎన్నిసార్లు చివాట్లు తిన్నా కొంతమంది పోలీసులు వైకాపా నాయకులకు వంతపాడుతూనే ఉన్నారు. చేస్తున్న ప్రతి తప్పుకి మూల్యం చెల్లించుకోక తప్పదు. తక్షణమే రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలి' అని వ్యాఖ్యానించారు. రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న వీడియోను షేర్ చేశారు.


More Telugu News