మాచర్లలో పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను కలిసిన సీఎం జగన్.. కుమార్తెకు సత్కారం!
- భారత జాతీయ పతాకానికి వందేళ్లు
- నాడు త్రివర్ణ పతాకానికి రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య
- మాచర్లలో నివసిస్తున్న పింగళి కుమార్తె సీతామహాలక్ష్మి
- సీతామహాలక్ష్మి నివాసంలో సీఎం సందడి
భారత జాతీయ పతాకాన్ని తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించడం మనందరికీ గర్వకారణం. కాగా, త్రివర్ణ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించి 100 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ నేడు పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను కలిశారు. గుంటూరు జిల్లా మాచర్లలో నివసిస్తున్న పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లారు. ఆమెను సీఎం ఘనంగా సన్మానించారు. ఆప్యాయంగా మాట్లాడి యోగక్షేమాలు కనుక్కున్నారు.
ఈ సందర్భంగా పింగళి వెంకయ్య జీవిత విశేషాలతో కూడిన చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయగా, సీఎం ఆసక్తిగా తిలకించారు. ఇక, సీఎం జగన్ స్వయంగా తమ నివాసానికి రావడం పట్ల పింగళి కుమార్తె సీతామహాలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.