అక్రమ కేసులను ఎత్తివేయకపోతే ఆందోళనకు దిగుతాం: అచ్చెన్నాయుడు
- వైసీపీ పాల్పడ్డ చర్యలు కనపడట్లేదా?
- ఎస్ఈసీ, డీజీపీ ఏం చేస్తున్నారు?
- అక్రమ కేసులు పెట్టడం అలవాటైపోయింది
- ఎన్నికలు ముగిశాక కూడా టీడీపీ నేతలపై వైసీపీ కక్ష సాధింపు
తమ పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయకపోతే ఆందోళనకు దిగుతామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్పడిన అక్రమాలు పోలీసులకు కనిపించట్లేదా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, డీజీపీ ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. తమ పార్టీ నేతలు ఎన్నికల అధికారుల విధులను అడ్డుకుంటున్నారంటూ అరెస్టులు చేశారని, అయితే, తమ నేతలు అడ్డుకుంది పోలీసుల విధులను కాదని, వైసీపీ రిగ్గింగ్ ను అడ్డుకున్నారని ఆయన చెప్పారు.
వైసీపీకి అక్రమ కేసులు పెట్టడం అలవాటు అయిపోయిందని ఆయన విమర్శించారు. ఎన్నికలు ముగిశాక కూడా టీడీపీ నేతలపై వైసీపీ కక్ష సాధింపులకు దిగుతోందని ఆయన ఆరోపించారు. కదిరిలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అండతో తమ పార్టీ నేత కందికుంట వెంకటప్రసాద్‌పైనా, అలాగే, గుంటూరు 42వ డివిజన్ టీడీపీ అభ్యర్థి బుజ్జిపైనా అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు.