ప్రమాదం నుంచి వేగంగా కోలుకుంటున్నా.. థ్యాంక్యూ: టాలీవుడ్ నటుడు నిఖిల్

  • గుజరాత్‌లో యాక్షన్ సన్నివేశాలు
  • ప్రమాదంలో నిఖిల్ కాలికి గాయం
  • త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ ట్వీట్
గుజరాత్‌లో జరుగుతున్న ‘కార్తికేయ2’ సినిమా షూటింగులో గాయపడిన టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ స్పందించాడు. తాను వేగంగా కోలుకుంటున్నానని, తన కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలంటూ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే చాలామంది తనకు ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని, మరికొందరు మెసేజ్‌లు చేస్తున్నారని పేర్కొన్నాడు. పూర్తిగా కోలుకుని రెట్టింపు ఉత్సాహంతో మీ ముందుకు వస్తానంటూ హ్యాండ్ స్టిక్‌తో నిల్చున్న ఫొటోను షేర్ చేశాడు.

కాగా, గతంలో మంచి విజయాన్ని అందుకున్న ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌గా ‘కార్తికేయ2’ సినిమాను రూపొందిస్తున్నారు. గుజరాత్‌లో ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంలో నిఖిల్ కాలికి గాయమైంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.


More Telugu News