గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేయాలని షర్మిల కీలక నిర్ణయం

  • 16లోగా కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని నిర్ణయం
  • కమిటీల ఏర్పాటు బాధ్యత పిట్టా రాంరెడ్డికి అప్పగింత
  • పార్టీ పేరు ప్రకటించేలోగానే కమిటీల ఏర్పాటు
తాను ప్రారంభించబోతున్న కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటించేందుకు వైయస్ షర్మిల సిద్ధమవుతున్నారు. మరోవైపు పార్టీని జనాల్లోకి తీసుకెళ్లే క్రమంలో అన్ని జిల్లాల వైయస్ అభిమానులతో ఆమె సమావేశాలను నిర్వహస్తున్నారు. తాజాగా ఆమె మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ ప్రకటన కంటే ముందుగానే వివిధ కమిటీలను ఏర్పాటు చేయాలని షర్మిల నిర్ణయించారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేయాలని... ఈ నెల 16లోగా కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావాలని నిర్ణయం తీసుకున్నారు. వైయస్ అభిమానులతో ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీల ఏర్పాటు బాధ్యతలను పిట్టా రాంరెడ్డికి అప్పగించారు.

మరోవైపు, క్రమంగా షర్మిల దూకుడు పెంచుతున్నారు. వైయస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలతో పాటు ఇతర రాజకీయపరమైన సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై కూడా ఆమె మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలు ప్రస్తావిస్తున్నారు.


More Telugu News