మాస్క్ పెట్టుకో అన్నందుకు.. ఊబెర్ డ్రైవర్ మొహంపై దగ్గిన ప్రయాణికురాలు!
- అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఘటన
- కారు దిగి పొమ్మన్న నేపాలీ డ్రైవర్
- ఫోన్ లాక్కుని రచ్చ చేసిన ప్రయాణికురాలు
- పోతూపోతూ పెప్పర్ స్ప్రే చల్లిన మహిళ
- ఆమెను నిషేధించిన ఊబెర్
కరోనా కేసులు తగ్గుతున్నా మాస్కులు కచ్చితంగా పెట్టుకోవాలని నిపుణులు చెబుతూనే ఉన్నారు. కానీ, కొందరు మాత్రం నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. మాస్కులు పెట్టుకో అని చెబితే.. ఎదుటి వారిపై ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఘటనే అమెరికాలో శుభకర్ ఖేడ్కా అనే ఓ నేపాలీ డ్రైవర్ కు ఎదురైంది. మాస్కు పెట్టుకోండి అన్న పాపానికి.. అతడి మీద నానా రచ్చ చేసింది ఓ మహిళ.
శుభకర్.. ఊబెర్ అండ్ లిఫ్ట్ లో డ్రైవర్ గా చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటలకు శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ మహిళ, ఆమె ఇద్దరు స్నేహితురాళ్లను ఆయన పికప్ చేసుకున్నాడు. అయితే, ఆమెకు మాస్క్ లేకపోవడంతో ఓ పెట్రోల్ పంప్ దగ్గర కారును ఆపి.. కొనుక్కోమని శుభకర్ చెప్పాడు. ఆమె స్నేహితురాలు మాస్కు కొనేందుకు వెళ్లగా.. ఆమె మాత్రం గొడవకు దిగింది. నానా రచ్చ చేసింది. మొహం మీద దగ్గింది. ఆమె పక్కన కూర్చున్న మరో మహిళ.. మాకు కరోనా వచ్చిందంటూ కామెంట్ చేసింది.
ముగ్గురు ప్రయాణికుల్లో ఒకామె ఆ తతంగాన్నంతా వీడియో తీసి ఇన్ స్టాగ్రామ్ లోనూ పోస్ట్ చేసింది. అయితే, ఆ తంతు మొత్తం శుభకర్ కారు కెమెరాలోనూ రికార్డ్ అయింది. వారి వైఖరితో విసుగెత్తి పోయిన శుభకర్.. రైడ్ ను ఎండ్ చేస్తున్నానని, కారు దిగిపోవాలని చెప్పాడు. అయితే, అందుకు వారు నిరాకరించారు. శుభకర్ తో గొడవకు దిగిన మహిళ.. అతని ఫోన్ లాగేసుకుంది. ఇయర్ ఫోన్ ను పాడు చేసింది. చివరకు కారు దిగిన ఆ ముగ్గురు.. పోతూ పోతూ శుభకర్ కళ్లలో ఓ స్ప్రే చల్లి పోయారు.
దీంతో ఊపిరాడక అతడు ఇబ్బంది పడ్డాడు. ఆ స్ప్రే వల్ల కారు పాడైందని అతడు చెప్పాడు. ఈ ఘటనంతా కారు కెమెరాలో రికార్డ్ కావడంతో అసలు విషయం బయటకొచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రయాణికురాలిని నిషేధిస్తున్నట్టు ఊబెర్, లిఫ్ట్ ప్రకటించాయి. పాడైన కారును రిపేర్ చేయించుకునేందుకు ఊబెర్ 120 డాలర్లు ఇచ్చింది. ఆసియాకు చెందిన వాడిని కావడం వల్లే తనపై జాతి వివక్షకు పాల్పడి ఉంటారని శుభకర్ చెప్పాడు.
ఇక, ఈ ఘటనపై ఆ మహిళా ప్రయాణికురాలు కూడా ఇన్ స్టాగ్రామ్ లో స్పందించింది. తన తప్పేమీ లేదని పేర్కొంది. అతడే తమపై ముందు నుంచీ అతిగా ప్రవర్తించాడని తెలిపింది. ప్రచారం జరుగుతున్న దానికి రెండో వైపు కూడా ఉంటుందని, దాని గురించి కూడా ఆలోచించాలని వ్యాఖ్యానించింది. అతడు కేవలం క్రాప్ చేసిన 40 సెకన్ల వీడియోనే ఎందుకు న్యూస్ చానెళ్లకు ఇచ్చాడో గుర్తించాలని కోరింది. తాను గొడవకు ముందు జరిగిన విషయాలను వెల్లడించలేనని తెలిపింది.