విశాఖలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం!
- 'విశాఖ ఉక్కు' పోరాటానికి కేటీఆర్ మద్దతు
- ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రశంసల జల్లు
- తెలుగు ప్రజల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు
ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, పలు సంఘాలు పోరాడుతోన్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వారి ఉద్యమానికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అవసరమైతే తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమతితో విశాఖకు వెళ్తానని, అక్కడ ఉద్యమకారులను కలిసి పోరాటానికి మద్దతిస్తామని కేటీఆర్ చెప్పారు.
దీంతో కేటీఆర్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు. కేటీఆర్ చిత్రపటాలకు స్టీల్ ప్లాంట్ కార్మికులు, స్థానికులు పాలాభిషేకాలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతాకలిసి పోరాడి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చర్యలను అడ్డుకుంటామని కార్మికులు చెప్పారు. తెలుగు ప్రజల ఐక్యత వర్ధిల్లాలంటూ నినదించారు.