మోదీకి కృతజ్ఞతలు చెబుతూ కెనడాలో ఫ్లెక్సీలు.. వీడియో ఇదిగో
- కెనడాకు కరోనా వ్యాక్సిన్లు పంపిన భారత్
- ఇరు దేశాల మధ్య స్నేహబంధం చిరకాలం కొనసాగాలని పోస్టర్లు
- భారత్ నుంచి పలు దేశాలకు వ్యాక్సిన్లు
కరోనా వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తోన్న భారత్ పలు దేశాలకు దాన్ని పంపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కు ఆయా దేశాలు కృతజ్ఞతలు చెబుతున్నాయి. ఇటీవలే కెనడాకు భారత్ వ్యాక్సిన్ పంపింది. దీంతో గ్రేటర్ టొరంటోలో భారత్‌తో పాటు, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెబుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఇందులో మోదీ ఫొటో భారత్, కెనడా జెండాలు ఉన్నాయి. తమ దేశానికి వ్యాక్సిన్ ఇచ్చినందుకు భారత్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు అందులో పేర్కొన్నారు. హిందూ ఫోరమ్ కెనడా ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహబంధం చిరకాలం కొనసాగాలని అందులో పేర్కొన్నారు.
కాగా, భారత్ నుంచి పలు దేశాలకు వ్యాక్సిన్లు అందాయి. సమీప భవిభష్యత్తులో మరిన్ని దేశాలకు వ్యాక్సిన్లు పంపుతారు. వ్యాక్సిన్ ప్రోగ్రాంలో భాగంగా ఐరాసకు కూడా భారత్ వ్యాక్సిన్లను పంపుతోంది.