సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై అస‌లు దాడే జ‌ర‌గ‌లేదంలోన్న‌ ప‌్ర‌త్య‌క్ష సాక్షులు.. వీడియోలు ఇదిగో

  • కాలికి పెద్ద క‌ట్టుక‌ట్టుకున్న మ‌మ‌తా బెన‌ర్జీ
  • ఆ స‌మ‌యంలో ఆమె కారులోనే ఉంద‌న్న ప్ర‌త్య‌క్ష సాక్షులు
  • కారు త‌లుపు ఓ పోస్ట‌ర్ కు తగిలింద‌ని వ్యాఖ్య‌
  • ఆ త‌ర్వాత త‌లుపును మూసేశార‌ని వివ‌ర‌ణ‌
అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగిందని, ఆమె కాలికి పూర్తిగా గాయ‌మైంద‌ని ఆమె పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఆమె కాలికి గాయం అయింద‌ని తెలుపుతూ ఆమె కాలికి పెద్ద క‌ట్టుక‌ట్టి ఉన్న ఫొటోను వైర‌ల్ చేస్తున్నారు. అయితే, ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారం, ఓట‌ర్ల సానుభూతి పొందడం కోస‌మే ఆమె ఇటువంటి గిమ్మిక్కులు చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

నందిగ్రామ్‌లో ఓ ప్రాంతంలో మ‌మ‌తపై దాడి జ‌రిగింద‌ని టీఎంసీ నేత‌లు అంటుండ‌గా, అదే స‌మ‌యంలో అక్కడ ఉన్న కొంద‌రు ప్ర‌త్య‌క్ష సాక్షులు మాత్రం అస‌లు ఆమెకు అక్క‌డ ఏమీ కాలేద‌ని చెబుతున్నారు. స్థానిక‌ విద్యార్థి సుమ‌న్ మైతీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ముఖ్య‌మంత్రి కారులో ఇక్క‌డ‌కు వ‌చ్చిన స‌మ‌యంలో చాలా మంది ఆమె చుట్టూ చేరారని అన్నాడు. మ‌మ‌తను ఎవ‌రూ తోయ‌లేద‌ని, అయితే, ఆమె మెడ, కాలికి గాయం అయిన‌ట్లు అనంత‌రం తెలిసింద‌ని, ఆ స‌మ‌యంలో ఆమె కారు మెల్లిగా క‌దులుతూ ముందుకు వెళ్ల‌డాన్ని చూశాన‌ని చెప్పాడు.  

చిత్తరంజన్చి దాస్ అనే మ‌రో వ్య‌క్తి మాట్లాడుతూ... 'నేను ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్నాను. ఆమె కారులోనే కూర్చుని ఉన్నారు. అయితే, కారు త‌లుపు తెరుచుకుని ఉంది. ఆ త‌లుపు ఓ పోస్ట‌ర్ కు త‌గ‌ల‌గానే దాన్ని మూసేశారు. ఆమెను ఎవ్వ‌రూ తోసేయ‌లేదు, కొట్టలేదు. ఆ కారు త‌లుపు వ‌ద్ద ఆ స‌మ‌యంలో ఎవ్వ‌రూ లేరు' అని తెలిపాడు. కాగా, ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ప‌నిచేస్తున్నారు.


More Telugu News