మహిళలు జీన్స్, పురుషులు నిక్కర్లు వేసుకున్నారో జాగ్రత్త: ఖాప్ పంచాయత్ హెచ్చరిక

  • ఇకపై అందరూ సంప్రదాయ దుస్తులే ధరించాలి
  • ఆదేశాలను ధిక్కరిస్తే సంఘ బహిష్కరణ
  • ఉత్తర ప్రదేశ్‌లోని పిపాల్సా గ్రామంలో ఘటన
మహిళలు జీన్స్, పురుషులు నిక్కర్లు (షార్ట్స్)  ధరించడం అన్నది ప్రస్తుతం సర్వసాధారణమైన విషయం. నగరాలు, పట్టణాలకే ఇది పరిమితం కాలేదు. పల్లెల్లోనూ ఇప్పుడు అందరిదీ ఇదే తీరు. అయితే, ఇకపై ఇక్కడ ఇలాంటివి కుదరవంటూ ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామ పంచాయతీ నిషేధం విధించింది.

ఇకపై గ్రామస్థులందరూ సంప్రదాయ దుస్తులనే ధరించాలని, కాదూ కూడదని వీటిని ధరించి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ముజఫర్‌నగర్ జిల్లా ఖాప్ పంచాయతీ ఆదేశాలు జారీ చేసింది. మహిళలు చీరలు, ఘాగ్రాలు, పంజాబీ డ్రెస్‌లు మాత్రమే ధరించాలని స్పష్టం చేసింది.

ఈ నెల 2న చార్తవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపాల్సా గ్రామంలో  జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పంచాయతీ నాయకుడు, కిసాన్ సంఘ్ చీఫ్ ఠాకూర్ పూరన్ సింగ్ తెలిపారు. ఆదేశాలను ధిక్కరించిన వారిని సంఘం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.


More Telugu News