తదుపరి కార్యాచరణ ప్రకటించిన రైతు సంఘాలు.. 26న భారత్ బంద్

  • 26 నాటికి రైతుల ఉద్యమానికి నాలుగు నెలలు
  • 15న ట్రేడ్ యూనియన్ల ఆందోళనల్లో రైతులు
  • 29న వ్యవసాయ చట్టాల ప్రతుల దహనం
నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ గత కొన్ని నెలలుగా ఉద్యమం చేస్తున్న రైతులు ఈ నెల 26 దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. 26 నాటికి తాము ఆందోళన చేపట్టి నాలుగు నెలలు పూర్తికాబోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైతు నేత బూటా సింగ్ తెలిపారు. ఆ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు బంద్ నిర్వహిస్తామని, ఎలాంటి అల్లర్లు, ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా బంద్ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.

మరోవైపు, ఇష్టానుసారం పెరిగిపోతున్న చమురు ధరలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 15న ట్రేడ్ యూనియన్లు నిర్వహించనున్న ఆందోళనల్లోనూ పాల్గొంటామని రైతు నేతలు తెలిపారు. అలాగే, ఈ నెల 29న హోలీని పురస్కరించుకుని ‘హోలీ కా దహన్’ పేరిట వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేయనున్నట్టు చెప్పారు.


More Telugu News