ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

  • ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగిన పోలింగ్
  • క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం
  • 14వ తేదీన వెలువడనున్న ఫలితాలు
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా అన్ని చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 5 గంటలకు ముగిసింది. అయితే, అప్పటికే క్యూలైన్లలో ఉన్నవారికి మాత్రం ఎంత సేపైనా ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. అన్ని పార్టీలు గెలుపు కోసం తమ సర్వ శక్తులను ఒడ్డడంతో ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా విశాఖ, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  

మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 59.93 శాతం పోలింగ్ నమోదు కాగా... చిత్తూరు జిల్లాలో అత్యల్పంగా 54.12 శాతం నమోదైంది.


More Telugu News