వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు: చంద్రబాబు మండిపాటు
- మునిసిపల్ ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓట్లు వేయాలి
- ఓటమి భయంతోనే వైసీపీ దాడులు
- దొంగ ఓట్లు వేయించేందుకు వైసీపీ ప్రయత్నాలు
- ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి
మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎవ్వరికీ భయపడకుండా ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు ఓటమి భయంతోనే తమ పార్టీ మద్దతుదారులపై దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
విజయవాడ 8వ డివిజన్ టీడీపీ నేతలపై దాడి చేశారని ఆయన చెప్పారు. అలాగే, ఆళ్లగడ్డ మునిసిపాలిటీ 4వ వార్డు అభ్యర్థి కాలేజీ సిబ్బందిని ఆర్వోలుగా నియమించారని ఆయన ఆరోపించారు. తిరుపతి 18వ డివిజన్‌లో దొంగ ఓట్లు వేయించేందుకు వైసీపీ ప్రయత్నాలు జరుపుతోందని చెప్పారు.
పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు అరాచకాలు సృష్టిస్తున్నారని, పోలింగ్ శాతం పెరగకుండా చూడాలని భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ పాల్పడుతోన్న చర్యలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. తమ పార్టీ చేతిలో వైసీపీ ఓడిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.