హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట‌లో క‌ల‌క‌లం.. యువ‌తిపై అత్యాచారం

  • ఓ యువ‌తి ఇంటికి వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తులు
  • బ్యాంకు ఉద్యోగుల‌మ‌ని ప‌రిచ‌యం
  • యువతితో మాట్లాడుతూ అత్యాచారం చేసిన నిందితుడు
హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట, డీఎస్‌ మక్తాలో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఒంటరిగా వున్న ఓ యువ‌తి ఇంట్లోకి వచ్చిన ఓ వ్య‌క్తి ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘటన కాస్త‌ ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. త‌న‌ కుటుంబ సభ్యులు మహారాష్ట్రకు వెళ్లగా ఓ అమ్మాయి(23) ఇక్క‌డే ఒంట‌రిగా ఇంట్లోనే ఉంటోంది.

ఈ విష‌యాన్ని గుర్తించిన ఇద్ద‌రు వ్య‌క్తులు నిన్న సాయంత్రం ఆమె ఇంటికి వ‌చ్చి, తాము బ్యాంకు ఉద్యోగుల‌మ‌ని పరిచయం చేసుకున్నారు. తర్వాత తమ బ్యాంకు నుంచి ఫైనాన్స్‌ ఇస్తామని యువతితో మాట‌లు క‌లిపారు. అనంత‌రం వారిలో ఓ వ్యక్తి ఇంటి బయటకు వెళ్లి కాపలా ఉన్నాడు.

మరో వ్యక్తి ఇంట్లో యువతితో మాట్లాడుతూ ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంత‌రం ఈ ఘటనపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఆమెను పోలీసులు  వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుప‌త్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. నిందితులను గుర్తించ‌డానికి పోలీసులు అక్క‌డి సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలిస్తున్నారు.


More Telugu News