నాకు వచ్చిన ఈ అవార్డును అలాంటి పురుషులకు అంకితమిస్తున్నాను: ఉపాసన కొణిదెల
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డు
- అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఎంపిక చేసిన ఫిక్కో
- మహిళలకు మద్దతు తెలిపే వారికి అంకితమిచ్చిన ఉపాసన
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సినీనటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలను ఎఫ్ఎల్ఓ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) మహిళా విభాగం తెలుగు రాష్ట్రాల నుంచి అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఎంపిక చేసి, అవార్డు అందజేసింది. ఈ అవార్డు అందుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ ఉపాసన పురుషుల గురించి పలు వ్యాఖ్యలు చేసింది.
'తన భార్య, తల్లి, సోదరి, కూతురు, కోడలు, మనవరాలి జీవితాల్లో వెలుగులు నింపే ప్రతి పురుషుడికి ఈ అవార్డును అంకితమిస్తున్నాను. పురుషుల మద్దతు వుండే మహిళలు చాలా సురక్షితంగా, సానుకూల దృక్పథంతో, విజయాలు సాధిస్తూ ఉంటారు అని నేను నమ్ముతాను' అని ఉపాపన ట్వీట్ చేసింది. కాగా, ఉపాసన అనేక సామాజిక, ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.