ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్

  • త్రివేంద్ర సింగ్ నిన్న రాజీనామా 
  • పలు పేర్లు పరిశీలించి చివరికి తీరత్ ఎంపిక  
  • రాష్ట్రపతి పాలనకు కాంగ్రెస్ డిమాండ్ 
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ (60) తన పదవికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. బీజేపీ అధిష్ఠానం సూచ‌న‌ల మేర‌కే ఆయ‌న రాజీనామా చేశారు. దీంతో సీఎం పదవి రేసులో ఉన్నారంటూ ప‌లువురి పేర్లు విన‌ప‌డ్డాయి. ఇప్ప‌టికే కేంద్ర, రాష్ట్ర మంత్రుల హోదాలో ఉన్న నేతల పేర్లను బీజేపీ పరిశీలించింది. చివ‌ర‌కు ఎంపీ తీర‌త్ సింగ్ రావ‌త్ పేరును ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది.

ఇప్ప‌టివ‌ర‌కు ఈ రేసులో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, ఉత్త‌రాఖండ్‌ రాష్ట్ర మంత్రులు ధన్సింగ్ రావత్, సత్పాల్ మహరాజ్ సహా మరికొందరు నేతల పేర్లు విన‌ప‌డ్డాయి. అయితే, పార్టీ శాసనపక్ష సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుని, తీర‌త్ సింగ్ రావ‌త్ పేరును ఖ‌రారు చేశారు.  

మరోపక్క, ఉత్త‌రాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించాల‌ని, అనంత‌రం ఎన్నికలు  నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.


More Telugu News