అమరావతి రైతులతో మార్చుకోవడానికి వీల్లేని ఒప్పందం జరిగింది: చంద్రబాబు

  • అమరావతి మహిళలపై దాడి పట్ల చంద్రబాబు స్పందన
  • హక్కు కల్పించాలని కోరితే భౌతికదాడులు చేస్తారా?
  • రైతులతో ప్రభుత్వం తరఫున ఒప్పందం చేసుకున్నాం 
  • రాజధాని కోసం రైతులు త్యాగం చేశారని వివరణ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రకాశం బ్యారేజి వద్ద అమరావతి మహిళలపై జరిగిన దాడి అమానుషం అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. హక్కు కల్పించాలని కోరితే భౌతికదాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. నాడు రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను అందరూ మెచ్చుకున్నారని అన్నారు.

అమరావతి రైతులతో ప్రభుత్వం తరఫున ఒప్పందం చేసుకున్నామని, అది మార్చుకోలేని ఒప్పందం అనీ స్పష్టం చేశారు. ఆ విధమైన నిబంధన ఉండడం వల్లే రైతులు భూములు ఇచ్చారని తెలిపారు.

అమరావతి భూముల వ్యవహారంలో అనేక అక్రమాలు జరిగాయని ప్రచారం చేశారని పేర్కొన్నారు. అమరావతిలో ఒకే కులం ఉందని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. జగన్ మాటలకు అందరూ మంచులా కరిగిపోయారని, ఆఖరికి అమరావతిలోనూ వైసీపీనే గెలిపించారని వ్యాఖ్యానించారు. తుళ్లూరు దీక్ష శిబిరాన్ని సందర్శించిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News