"ఆడు మగాడు రా బుజ్జీ.. మెసేజ్ చేయకురా!": ఫేక్ అకౌంట్లపై సైబరాబాద్ పోలీసుల వినూత్న ప్రచారం
- సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో మోసాలు
- అమ్మాయిల పేరుతో అకౌంట్లు తెరిచి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులు
- ప్రజలను అప్రమత్తం చేసిన సైబర్ క్రైమ్ విభాగం
- 'అతడు' చిత్రంలో సీన్ తో మీమ్స్
సోషల్ మీడియాలో అమ్మాయిల పేరుతో అకౌంట్లు తెరిచి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులను గతంలో పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే ఇప్పటికీ అలాంటి మోసాలు జరుగుతుండడం, పలువురు మోసపోయి భారీ మొత్తంలో డబ్బు సమర్పించుకుంటుండడం పట్ల సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఈ మేరకు వినూత్నంగా ప్రచారం చేస్తోంది.
మహేశ్ బాబు హీరోగా వచ్చిన 'అతడు' చిత్రంలో బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి మధ్య వచ్చే ఓ సీన్ ఆధారంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. "ఆడు మగాడురా బుజ్జీ... అమ్మాయి కాదురా" అంటూ తనికెళ్ళ భరణి... బ్రహ్మాజీకి హితవు చెబుతున్నట్టు మీమ్స్ తయారుచేసింది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.