154 స్థానాల్లో పోటీచేయాలని ఎంఎన్ఎం నిర్ణయం... రేపు తొలి జాబితా విడుదల చేయనున్న కమలహాసన్
- తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు
- మొత్తం 234 సీట్లకు ఎన్నికలు
- భాగస్వామ్య పక్షాలకు కూడా సీట్లను పంచనున్న ఎంఎన్ఎం
- విజయ్ కాంత్ పార్టీకి కమల్ స్నేహ హస్తం!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినీ నటుడు కమలహాసన్ ఆధ్వర్యంలోని మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) నుంచి రేపు తొలి జాబితా విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు పార్టీ అధినేత కమల్ తమ అభ్యర్థుల జాబితాను మీడియాతో పంచుకోనున్నారు.
కాగా, తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లు ఉండగా, పొత్తుల నేపథ్యంలో కమలహాసన్ మక్కళ్ నీది మయ్యం పార్టీ 154 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. మిగతా స్థానాల్లో భాగస్వామ్య పక్షాలకు మద్దతు పలకాలని తీర్మానించింది.
ఎంఎన్ఎం ఇప్పటికే నటుడు శరత్ కుమార్ కు చెందిన ఆలిండియా సమతువ మక్కళ్ కట్చి పార్టీతోనూ, ఇందియ జననాయగ కట్చితోనూ పొత్తు కుదుర్చుకుంది. అటు, బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమి నుంచి వైదొలగిన నటుడు విజయకాంత్ పార్టీ దేశియ ముర్పొక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) పార్టీకి కమల్ స్నేహ హస్తం చాచినట్టు వార్తలొస్తున్నాయి. మరి రేపు ఎంఎన్ఎం తొలి జాబితా విడుదల చేస్తున్న నేపథ్యంలో డీఎండీకేను కూడా పరిగణనలోకి తీసుకుంటారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షెడ్యూల్ విడుదలైంది.