ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై మరో అంశంలో విచారణకు ఆదేశించిన ఏపీ సర్కారు

  • ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి ఆరోపణలు
  • ఇప్పటికే సస్పెన్షన్ విధించిన ఏపీ సర్కారు
  • నాటి విపక్షంపై వేధింపులకు యత్నించారని తాజా ఆరోపణలు
  • విచారణ బాధ్యతలు ఆర్పీ సిసోడియాకు అప్పగింత
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు గతంలో డిపార్ట్ మెంట్ పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డాడని ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరో అంశంలోనూ ఆయనపై విచారణ జరపాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.

 ప్రభుత్వ పదవిలో ఉంటూ పక్షపాత ధోరణితో నాటి ప్రతిపక్షాన్ని వేధించేందుకు ప్రయత్నించారనే అంశంపై రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. విచారణ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియాకు అప్పగించింది. అఖిలభారత సర్వీసు నిబంధనలు 1969 అనుసరించి ఈ మేరకు విచారణకు ఆదేశాలు ఇచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక, ఆర్పీ సిసోడియా కమిటీ ఎదుట ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించేందుకు సర్వ శ్రీనివాసరావును ప్రజెంటింగ్ అధికారిగా నియమించారు.


More Telugu News