అందుకే బాధలన్నీ ఓర్చుకుని టీమిండియాతో టెస్టు సిరీస్ బరిలో దిగాం: స్టోక్స్
- భారత్ లో ఎండ వేడిమికి ఇంగ్లండ్ ఆటగాళ్లు బేజారు
- తాను 5 కిలోల బరువు తగ్గినట్టు స్టోక్స్ వెల్లడి
- ఇతర ఆటగాళ్లు కూడా బరువు కోల్పోయారని వివరణ
- ఇంగ్లండ్ లో వాతావరణం ఇలా ఉండదన్న స్టోక్స్
ఇంగ్లండ్ అగ్రశ్రేణి ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. ఇటీవల ముగిసిన 4 టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ 1-3 తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే, తాము తమకు అలవాటు లేని ప్రతికూల వాతావరణంలో ఆడాల్సి వచ్చిందని, ఎన్ని సమస్యలున్నా జట్టు కోసం ఆడాలి కాబట్టి, బాధను ఓర్చుకుని బరిలో దిగామని స్టోక్స్ తెలిపాడు. భారత్ లో అధికవేడిమితో తాము కొన్నిరోజుల వ్యవధిలోనే కిలోల కొద్దీ బరువు తగ్గామని తెలిపాడు.
తాను వారం రోజుల్లో 5 కిలోలు బరువు కోల్పోతే, డామ్ సిబ్లీ 4 కిలోలు, జిమ్మీ ఆండర్సన్ 3 కిలోలు బరువు తగ్గారని స్టోక్స్ వివరించాడు. స్పిన్నర్ జాక్ లీచ్ ఇక్కడి వాతావరణానికి అలవాటు పడలేక బౌలింగ్ స్పెల్ విరామం వచ్చినప్పుడల్లా టాయిలెట్ కు పరిగెత్తేవాడని వెల్లడించాడు.
ఇంగ్లండ్ లో వాతావరణం ఇలా ఉండదని, భారత్ లో తాము 41 డిగ్రీల ఎండవేడిమిని భరించలేకపోయామని స్టోక్స్ వాపోయాడు. అయితే, టీమిండియా ఆటగాళ్లకు ఇక్కడి వాతారణం అలవాటే కాబట్టి సుందర్, పంత్ వంటి ఆటగాళ్లు క్రీజులో నిలదొక్కుకుని మంచి ఇన్నింగ్స్ ఆడారని తెలిపాడు.