సచిన్, సెహ్వాగ్, యువీ మధ్య ఆసక్తికర సంభాషణ.. వీడియో ఇదిగో
- రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో పాల్గొంటోన్న మాజీ క్రికెటర్లు
- ఫిట్‌నెస్ ప్రక్రియలో పాల్గొన్న సచిన్
- సచిన్ మన దేవుడన్న సెహ్వాగ్
- సెహ్వాగ్ సింహం, సచిన్ కొదమ సింహం అన్న యువీ
టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియోను సెహ్వాగ్ పోస్ట్ చేశాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా పలు దేశాల మాజీ క్రికెటర్లు ఉత్సాహంగా క్రికెట్ ఆడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇంగ్లండ్ లెజెండ్స్‌తో ఇండియా లెజెండ్స్ మ్యాచ్ ఆడనుంది.
ఇందులో భాగంగా ఫిట్‌నెస్ ప్రక్రియలో సచిన్ టెండూల్కర్ తన ఎడమ మోచేతికి సూదులు గుచ్చుకుని ఫిజియో పర్యవేక్షణలో పాల్గొన్నాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో సెహ్వాగ్ పోస్ట్ చేశాడు. సచిన్ పక్కనే యువరాజ్ సింగ్ కూర్చోగా వారంతా జోకులు వేసుకున్నారు.
సచిన్ మన దేవుడని, క్రికెట్ ఆడీ ఆడీ చేతులమీద వెంట్రుకలు కూడా రాలేదని సరదాగా సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఆయన సూదులు గుచ్చుకొని తర్వాతి మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నాడని చెప్పాడు. అలాగే, యువీ కూడా మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాడో లేదో తెలుసుకుందామని అన్నాడు.
అయితే, సచిన్ గురించి సెహ్వాగ్‌తో యువీ మాట్లాడుతూ... సెహ్వాగ్ ఒక సింహం అని, సచిన్ మాత్రం ఓ కొదమ సింహం అని వ్యాఖ్యానించాడు. సన్నద్ధత ఎలా ఉందని అనంతరం సచిన్ ను అడగగా ఇందుకు ఆయన స్పందిస్తూ.. నువ్వుండగా ఎవరికైనా ఆ అవకాశం ఉంటుందా? అని సరదాగా ప్రశ్నించాడు. ఆ తర్వాత సెహ్వాగ్ కూడా సచిన్ తో మాట్లాడుతూ మ్యాచ్‌కు సిద్ధమయ్యారా? అని అడిగాడు. సచిన్ స్పందిస్తూ దాని కోసమే ప్రయత్నిస్తున్నానని చెప్పాడు.