అమెరికాలో కరోనా బారినపడిన గొరిల్లాలకు టీకా!

  • జూ సిబ్బంది ద్వారా గొరిల్లాలకు కరోనా
  • ప్రయోగాత్మకంగా టీకా
  • మింక్‌లలోనూ టీకాను పరీక్షిస్తున్న శాస్త్రవేత్తలు
అమెరికాలో కరోనా బారినపడిన గొరిల్లాలు టీకా వేశారు. వీటిలో నాలుగు ఒరాంగుఠాన్‌లు, ఐదు బొనొబులు వున్నాయి. జనవరిలో శాన్‌డియాగా జూ సిబ్బందికి కరోనా వైరస్ సోకగా, వారి నుంచి వీటికి వైరస్ సంక్రమించింది. అప్రమత్తమైన అధికారులు చికిత్స ద్వారా వాటిని కాపాడారు. తాజాగా, వీటికి కరోనా టీకాలు వేశారు. దగ్గు, జలుబు వంటి స్వల్ప లక్షణాలు మినహా వాటి ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు తెలిపారు. పెంపుడు జంతువుల కోసం తయారు చేసిన ఈ కరోనా టీకాను ప్రయోగాత్మకంగా వీటికి అందించారు. ఇప్పుడు మింక్‌లలోనూ ఈ టీకాను పరీక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు.


More Telugu News