మమత టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరిన నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు

  • బెంగాల్ లో కొనసాగుతున్న వలసలు
  • ఇటీవల 291 మందితో అభ్యర్థుల జాబితా ప్రకటన 
  • 23 మంది సిట్టింగ్ లకు టికెట్ నిరాకరణ
  • సీఎంపై తీవ్ర అసంతృప్తి
పశ్చిమ బెంగాల్ లో వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల సీఎం మమత బెనర్జీ 291 మంది అభ్యర్థులతో తృణమూల్ కాంగ్రెస్ జాబితా ప్రకటించారు. 23 మంది సిట్టింగ్ శాసనసభ్యులకు టికెట్ నిరాకరించారు. వారిలో రవీంద్రనాథ్ భట్టాచార్య, జాటు లాహిరి, సోనాలీ గుహా, దీపేందు బిశ్వాస్ కూడా ఉన్నారు.

ఇప్పుడా నలుగురు తృణమూల్ కు గుడ్ బై చెప్పేశారు. ఆపై ఆలస్యం చేయకుండా బీజేపీలో చేరారు. కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరికి పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాషాయదళంలోకి స్వాగతం పలికారు.

ఇప్పటికే టీఎంసీని వీడిన చాలామంది నేతలు బీజేపీలోకి వెళుతున్నారు. గతంలో టీఎంసీ తరఫున రాజ్యసభకు వెళ్లిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి నిన్న బీజేపీలో చేరడం తెలిసిందే. అంతకుముందే పార్టీని వీడిన మాజీ మంత్రి సువేందు అధికారి బీజేపీలో చేరి, ఏకంగా నందిగ్రామ్ లో మమతపైనే పోటీకి దిగుతున్నారు. ఆయన ఈ నెల 12న నామినేషన్ దాఖలు చేయనున్నారు.


More Telugu News