సరిహద్దులో శాంతియుత వాతావ‌ర‌ణం నెల‌కొంది: చైనా

  • ఇరు దేశాలు మంచి మిత్రదేశాలు
  • ప్రత్యర్థి దేశాలు కాదు
  • స‌రిహ‌ద్దుల నుంచి బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ
చైనా-భారత్ మ‌ధ్య ఉన్న సంబంధాల‌పై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పందిస్తూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఇరు దేశాలు మంచి మిత్రదేశాల‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇరు దేశాలు ప్రత్యర్థి దేశాలు కావ‌ని, సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకునే పరిస్థితుల కోసం కృషి చేశాయ‌ని చెప్పారు.

ఇరు దేశాల మ‌ధ్య ఉన్న‌ సరిహద్దు విభేదాలను ఆధారంగా తీసుకుని చైనా, భారత్‌ బంధాన్ని అంచనా వేయకూడదని ఆయ‌న తెలిపారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించుకోవాల‌ని, దాని ద్వారానే ఇరు దేశాల మధ్య ఉన్న‌ అనుమానాలన్నీ పోతాయ‌ని ఆయ‌న చెప్పారు.

స‌రిహ‌ద్దుల నుంచి ఇరు దేశాలు బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకున్నాయ‌ని, దీంతో శాంతియుత వాతావార‌ణం నెల‌కొందని అన్నారు. ఇప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు మార్గం సుమ‌గ‌మ‌వుతుంద‌ని ఆయ‌న తెలిపారు.


More Telugu News