మహిళపై యాసిడ్ పోసి పారిపోయిన దుండగుడు
- మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలంలో ఘటన
- హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
- పరారీలో ఉన్న నిందితుడు
ఓ వైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గొప్పదనాన్ని పలువురు కీర్తిస్తున్నారు. మహిళల సంరక్షణకు ఎవ్వరూ తీసుకోని చర్యలను తాము తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు, అదే మహిళా దినోత్సవం నాడు మహిళపై యాసిడ్ దాడి జరిగింది.
మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్‌లో ఓ వివాహితపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్ దాడి చేసి పారిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, బాధితురాలిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలిది టేక్మాల్ మండలం అంతాయిపల్లి తండా అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.