పిడకలతో పొగవేస్తే ఇల్లంతా పరిశుభ్రం అయిపోతుంది: మధ్యప్రదేశ్ మంత్రి
- నెయ్యి వేసి ఆవు పిడకలతో పొగవేస్తే 12 గంటలపాటు పరిశుభ్రత
- నా వ్యాఖ్యలు వింతగా ఉండొచ్చు
- ఇది కూడా సైన్సేనన్న మంత్రి ఉష
కరోనా మహమ్మారి విరుచుకుపడిన తర్వాత పరిశుభ్రతపై జనంలో అవగాహన పెరిగింది. శానిటైజేషన్ ద్వారా వైరస్‌ను దూరంగా ఉంచొచ్చని వైద్య నిపుణులు చెబుతుండడంతో అందరూ శానిటైజర్లు పట్టుకుని తిరుగుతున్నారు. అయితే, వీటితో ఎంతమాత్రమూ పనిలేదని, ఆవు పేడతో చేసిన పిడకలను పొగవేయడం ద్వారా ఇంటిని పూర్తి పరిశుభ్రంగా మార్చుకోవచ్చని మధ్యప్రదేశ్ సాంస్కృతికశాఖ మంత్రి ఉషా ఠాకూర్ సెలవిచ్చారు.
కరోనా వైరస్ నుంచి దూరంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు వైదిక జీవన విధానాన్ని అనుసరించాలని కోరారు. ఇండోర్‌లోని ప్రెస్ క్లబ్‌లో మాట్లాడిన మంత్రి.. వైదిక జీవన విధానాన్ని అనుసరించాలని కరోనా మహమ్మారి మనకో సందేశం పంపిందన్నారు. ఆవు పిడకల్లో నెయ్యి వేసి పొగ వేయడం ద్వారా ఇంటిని శానిటైజ్ చేసుకోవచ్చని, ఆ పొగ 12 గంటలపాటు ఇంటిని పూర్తి పరిశుభ్రంగా ఉంచుతుందని పేర్కొన్నారు. తన సూచన చాలామందికి వింతగా అనిపించొచ్చని, కానీ ఈ చిట్కా గంటలపాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతుందని పేర్కొన్నారు. ఇది కూడా సైన్సేనని ఉషా ఠాకూర్ పేర్కొన్నారు.