ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల ఆందోళన.. కేంద్రానికి లేఖ రాసి మరో రైతు ఆత్మహత్య
- చట్టాలను రద్దు చేసి తన చివరి కోరిక తీర్చాలంటూ లేఖ
- రైతు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న రజ్బీర్
- చట్టాలను రద్దు చేసే వరకు కదలబోమంటున్న రైతులు
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల్లో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఆత్మహత్యతోనైనా కేంద్రం ఈ చట్టాలను రద్దు చేయాలని అతడు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హర్యానాలోని హిసార్‌కు చెందిన రజ్బీర్ (49) రైతు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. తమ ఉద్యమానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన రజ్బీర్ ఓ లేఖ రాసి టిక్రీ సరిహద్దులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాగు చట్టాలను రద్దు చేసి తన చివరి కోరిక తీర్చాలని అందులో ఆయన వేడుకున్నాడు.
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన చేస్తున్న రైతుల్లో ఇప్పటికే పలువురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతేడాది డిసెంబరులో పంజాబ్‌కు చెందిన న్యాయవాది , సిక్కు మత గురువు సంత్ రామ్‌సింగ్ ఉద్యమం కోసం ఊపిరి తీసుకున్నారు.