ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య

  • గత 24 గంటల్లో 45,702 కరోనా పరీక్షలు
  • 136 మందికి పాజిటివ్
  • ఒక్క చిత్తూరు జిల్లాలోనే 49 కొత్త కేసులు
  • ఒకరి మృతి
  • ఇంకా 998 మందికి కొనసాగుతున్న చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి మళ్లీ పుంజుకుంటోందా? అని ఆందోళన రేకెత్తించేలా రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 45,702 కరోనా పరీక్షలు నిర్వహించగా 136 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 49 మందికి కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 15, అనంతపురం జిల్లాలో 14, విశాఖ జిల్లాలో 12, కడప జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 11 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక కేసు నమోదైంది.

అదే సమయంలో 58 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,90,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,520 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 998గా నమోదైంది. మొత్తం మరణాల సంఖ్య 7,174కి చేరింది.


More Telugu News