నేను అసలు సిసలైన త్రాచును... ఒక్క కాటుతో చచ్చిపోతారు: బీజేపీలో చేరిన అనంతరం మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలు
- కోల్ కతాలో మోదీ బహిరంగ సభ
- కాషాయ కండువా కప్పుకున్న నటుడు మిథున్ చక్రవర్తి
- తనను నీటి పాముగా భావించవద్దని స్పష్టీకరణ
- బీజేపీలో చేరికతో తన కల నిజమవుతుందని భావిస్తున్నట్టు వ్యాఖ్యలు
బాలీవుడ్ లెజెండ్ మిథున్ చక్రవర్తి కాషాయ దళంలో చేరిన సంగతి తెలిసిందే. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ కోల్ కతాలో భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో మిథున్ చక్రవర్తి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన మాతృభాష బెంగాలీలో మాట్లాడుతూ, తనను ఎలాంటి హాని చేయని నీటిపాముగా భావించవద్దని స్పష్టం చేశారు. తాను నికార్సయిన త్రాచుపాము లాంటివాడ్నని, ఒక్క కాటుతో చచ్చిపోతారని హెచ్చరించారు.
జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలని అనుకునేవాడ్నని... అయితే, ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందుతున్న నరేంద్ర మోదీ వంటి మహానేత హాజరైన భారీ బహిరంగ సభలో పాల్గొంటానని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. సమాజంలో నిరుపేద వర్గాలకు సేవ చేయాలని కోరుకున్నానని, ఆ కోరిక ఇప్పుడు తీరనుందని మిథున్ తెలిపారు.