ఒక్క పొర మాస్కులు కరోనాను కట్టడి చేయలేవు: పరిశోధకులు
- దగ్గినా, మాట్లాడినా ముక్కు, నోటి ద్వారా రేణువులు
- వాటి వేగాన్ని ఒక పొర ఉండే మాస్కులు కట్టడి చేయలేవు
- మూడు పొరల మాస్కులు అడ్డుకుంటాయి
- భారతీయ విజ్ఞాన సంస్థ గుర్తింపు
కరోనా విజృంభణ కారణంగా దాని కట్టడి కోసం అందరూ మాస్కులు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో మాస్కులపై పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు మాస్కుల గురించి మరో విషయాన్ని గుర్తించారు. ఒక్క పొర మాస్కు కంటే మూడు పొరల మాస్కులే కొవిడ్-19ను సమర్థంగా అడ్డుకోగలవని చెప్పారు.
సాధారణంగా మనం దగ్గినా, మాట్లాడినా ముక్కు, నోటి ద్వారా రేణువులు అత్యంత వేగంగా బయటకు వస్తాయి. దీంతో వాటి వేగాన్ని ఒక పొర ఉండే మాస్కులు కట్టడి చేయలేవని పరిశోధకులు గుర్తించారు.
బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) పరిశోధకులు విదేశీ వర్సిటీల శాస్త్రవేత్తల బృందంతో కలిసి జరిపిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది. ఎన్-95 లేక వస్త్రంతో చేసిన మూడు పొరలున్న మాస్కులు వైరస్‌లను సులువుగా అరికట్టగలవని వారు తేల్చి చెప్పారు.