శర్వానంద్ 'శ్రీకారం' కోసం కదిలిన చిరంజీవి, కేటీఆర్!
- రైతుల సమస్యలపై తెరకెక్కిన చిత్రం
- 11న విడుదల కానున్న 'శ్రీకారం'
- ప్రమోట్ చేసేందుకు చిరంజీవి, కేటీఆర్
- అంగీకరించారన్న శర్వానంద్
14 రీల్స్ పతాకంపై శర్వానంద్ హీరోగా, ఓ విభిన్నమైన సామాజిక కథాంశంతో తెరకెక్కుతున్న 'శ్రీకారం' చిత్రం ప్రమోషన్ కు సాయం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవితో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ అంగీకరించారు. ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా, నూతన దర్శకుడు కిశోర్ బీ దర్శకత్వం వహించారు. నిన్న శర్వానంద్ పుట్టినరోజు కాగా, హైదరాబాద్ లో సినిమా యూనిట్ ఓ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శర్వానంద్, ఇటువంటి సినిమాను అందరూ చూడాలని అన్నారు.
ఈ కథను విన్నప్పుడే తనకు నటించాలని అనిపించిందని, ఇటువంటి స్టోరీలు మళ్లీ మళ్లీ రావని వ్యాఖ్యానించిన శర్వానంద్, రైతుల సమస్యలపై ప్రధానంగా స్టోరీ సాగుతుందని అన్నారు. ట్రయిలర్ విడుదలైన తరువాత తనకు తొలి ఫోన్ రామ్ చరణ్ నుంచి వచ్చిందని చెప్పారు. ఈ సినిమా స్టోరీ లైన్ బాగుందని, దీని ప్రమోషన్ కు సపోర్ట్ చేయాలని భావిస్తున్నానని చెప్పిన రామ్ చరణ్, ట్రయిలర్ ను చిరంజీవికి చూపించారని తెలిపారు.
వెంటనే చిరంజీవి ఖమ్మంలో 8న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తానని మాటిచ్చారని, ఆపై కేటీఆర్ ను సంప్రదిస్తే, 9న హైదరాబాద్ లో జరిగే ప్రమోషనల్ ఈవెంట్ కు వస్తానని చెప్పారని శర్వానంద్ అన్నారు. వీరి రాక పబ్లిసిటీ కోసం కాదని, వారిలాంటి పెద్దవారు చెబితే, మరింత మందికి సినిమా దగ్గరవుతుందని వ్యాఖ్యానించిన శర్వానంద్, యువతను ఈ సినిమాతో ఇన్ స్పైర్ చేస్తామన్న నమ్మకం ఉందని అన్నారు. కాగా, ఇటీవల సినిమా ట్రయిలర్ ను హీరో నితిన్, నాని, వరుణ్ తేజ్ లు సంయుక్తంగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.