చంద్రుని మీదకు వెళ్లేందుకు కోకొల్లలుగా అర్జీలు పెట్టుకున్న భారతీయులు!
- ఉచితంగా తీసుకుని వెళతానన్న జపాన్ బిలియనీర్
- నాలుగు రోజుల్లో ఐదు లక్షల దరఖాస్తులు
- 15 దేశాల నుంచి వెల్లువలా వచ్చిన అప్లికేషన్స్
మనమంతా చిన్నప్పుడు చందమామ రావే... జాబిల్లి రావే... అంటూ అమ్మ పాట వింటూ గోరుముద్దలు తిన్నవారమే. చందమామ రాకపోయినా, ఇప్పుడు చంద్రుని మీదకు వెళ్లి వచ్చే కల సాకారం కానుంది. చంద్రుని మీదకు తాను ఉచితంగా తీసుకుని వెళతానని, ఎవరెవరు వస్తారో దరఖాస్తు చేసుకోవాలని జపాన్ బిలియనీర్ యుసాకు మాయిజావా వెల్లడించగా, నాలుగు రోజుల్లోనే ఐదు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయట.
మొత్తం 15 దేశాల నుంచి ఔత్సాహికులు తాము కూడా వస్తామని పేర్కొనగా, అత్యధిక దరఖాస్తులు ఇండియా నుంచే వచ్చాయని యుసాకు వెల్లడించారు. ఎలాన్ మస్క్ తయారు చేసిన స్పేస్ ఎక్స్ రాకెట్ లో తనతో పాటు మొత్తం 8 మందిని ఉచితంగా తీసుకుని వెళతానని ఆయన అంటున్నారు.