పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: 57 మందితో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ
- బెంగాల్ లో మార్చి 27 నుంచి ఎన్నికలు
- మొత్తం 8 దశల్లో పోలింగ్
- ఏప్రిల్ 29న తుది విడత పోలింగ్
- ఇప్పటికే 291 మందితో అధికార టీఎంసీ తొలిజాబితా
- తన అభ్యర్థులను కూడా ప్రకటించిన బీజేపీ
- నందిగ్రామ్ నుంచి సువేందు అధికారి
పశ్చిమ బెంగాల్ లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార టీఎంసీ ఇప్పటికే 291 మందితో తొలి జాబితా విడుదల చేయగా, బెంగాల్ లో అధికారం చేపట్టాలని కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించింది. 57 మందితో నేడు తొలిజాబితాను వెల్లడించింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన మాజీ మంత్రి సువేందు అధికారికి ఆయన కోరుకున్న నందిగ్రామ్ నియోజకవర్గాన్నే కేటాయించారు.
నందిగ్రామ్ నుంచి సీఎం మమత బెనర్జీ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మమత బెనర్జీ నందిగ్రామ్ లో పోటీచేస్తే చిత్తుగా ఓడిస్తానని సువేందు అధికారి ఇంతకుముందే ప్రకటించారు. కేవలం మమతాపై పోటీ కోసమే ఆయన తన శాసనసభ స్థానం భవానీపూర్ ను వీడి నందిగ్రామ్ బరిలో దిగుతున్నారు. సీఎం మమతకు వ్యతిరేకంగా సువేందు బలమైన అభ్యర్థి అని బీజేపీ భావిస్తోంది.