బీజేపీ వివాదాస్పద ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కు అస్వస్థత... ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబయి తరలింపు

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడిన ప్రగ్యా
  • భోపాల్ నుంచి ముంబయి తరలింపు
  • ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స
  • గత నెలలోనూ ఇదే సమస్యతో బాధపడిన ప్రగ్యా
  • 2020 డిసెంబరులో కరోనా బారినపడిన ఎంపీ
వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టిందిపేరైన బీజేపీ మహిళా ఎంపీ ప్రగ్యా ఠాకూర్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆమె ఇబ్బందులు ఎదుర్కోవడంతో హుటాహుటీన ముంబయి తరలించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఓ ప్రత్యేక విమానంలో ఆమెను ముంబయి తీసుకెళ్లారు. ప్రగ్యా ఠాకూర్ ప్రస్తుతం ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నెలరోజుల వ్యవధిలో ఆమె అనారోగ్యానికి గురవడం ఇది రెండోసారి. గత నెల 19న ఆమెను ఇలాంటి పరిస్థితుల్లోనే ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. కాగా, గతేడాది డిసెంబరులో ప్రగ్యా ఠాకూర్ కరోనా బారినపడి ఢిల్లీ ఎయిమ్స్ లోనే చికిత్స పొందారు.


More Telugu News